V6 News

సంగారెడ్డి ఎరిత్రో ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి ఎరిత్రో ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న ఎరిత్రో ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ప్లాంట్లో పొగలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయాందోళనలో బయటకు పరుగులు తీశారు. ఈ ఫార్మా కంపెనీలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు కనీసం ఎలాంటి ఫైర్ కంట్రోల్ పరికరాలు లేకపోవడంతో పరిసర కంపెనీల కార్మికులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

అగ్ని ప్రమాదాలతో ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడంతో తరచూ రియాక్టర్లు పేలడం, షార్ట్ సర్క్యూట్స్ వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో కార్మికులు ప్రాణాలు పోతున్నాయి. ప్రమాదం నుంచి బయటపడినవారు గాయాలపాలవుతున్నారు.

సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫ్యాక్టరీల్లో మేనేజ్‌‌మెంట్, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆఫీసర్ల పర్యవేక్షణ లేదన్న విమర్శలు ఉన్నాయి. గ్యాస్, బయో ఫ్యుయల్ ఆధారిత ఫ్యాక్టరీల్లో గ్యాస్ చాంబర్, రియాక్టర్లు, కెమికల్​ వేస్టేజ్, విషవాయువులు నిండి రియాక్టర్లు పేలడం, గ్యాస్ లీక్ అవడం, షాక్ సర్క్యూట్స్ వంటి ఘటనలు రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి.

►ALSO READ | ఖమ్మం జిల్లా వైరా ఏరియా వాళ్లకు ఈ ముచ్చట తెలుసో.. లేదో..!

కెమికల్ ఫ్యాక్టరీల్లో పని చేయించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అన్​స్కిల్డ్ లేబర్‌‌‌‌తో పని చేయించుకుంటున్నారు. దీంతో వీరికి సరైన అవగాహన లేక అత్యవసర టైంలో ప్రమాదాలకు కారణమవుతున్నారు.