వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్

వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రెండో వర్థంతి సందర్బంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లు ఆయనకు నివాళులు అర్పించారు. ‘దేశంకోసం ఆయన చేసిన సేవలు దేశప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. ఆయన చేసిన కృషిని, దేశ ప్రగతికి చేసిన ప్రయత్నాలను భారతదేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది’ అని మోడీ ట్వీట్ చేశారు. వాజ్‌పేయిని గుర్తుచేసుకుంటూ.. మోడీ ఒక వీడియోను కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ఆదివారం వాజ్‌పేయి రెండో వర్థంతి సందర్బంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు స్టాల్ వార్ట్స్ మెమొరియల్ వద్ద నివాళులు అర్సించారు.

డిసెంబర్ 25, 1924 మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించిన వాజ్‌పేయి.. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో 93 ఏళ్ల వయసులో ఆగష్టు 16, 2018న మరణించారు.

భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని అయిన తొలి నాయకుడు వాజ్‌పేయి. అతను భారతదేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 1996లో, 1998 నుండి 1999 వరకు మరియు తరువాత 1999 మరియు 2004 మధ్య పూర్తి ఐదేళ్ల కాలపరిమితికి ప్రధానిగా పనిచేశారు. ఆయన పదవీకాలంలోనే భారతదేశం 1998లో మే 11 మరియు మే 13న పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించింది.

వాజ్‌పేయి 1977 మరియు 1979 లలో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. వాజ్‌పేయి జన్మదినాన్ని భారతప్రభుత్వం ‘గుడ్ గవర్నెన్స్ డే’ గా ప్రకటించింది. వాజ్‌పేయికి భారతప్రభుత్వం 2014లో భారతరత్న బిరుదుతో సత్కరించింది.

For More News..

నడి చెరువులో సిరిసిల్ల కలెక్టరేట్!

జెండా బ్లాక్‌గా పిలుచుకున్న జె బ్లాక్‌ ఇప్పుడు లేదాయే

నీటి విషయంలో రాజీపడం