కువైట్ పాలకుడు మృతి.. సంతాపం దినం ప్రకటించిన భారత్

కువైట్ పాలకుడు మృతి.. సంతాపం దినం ప్రకటించిన భారత్

కువైట్ పాలకుడు ఎమిర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అల్-సబాహ్. రాజకుటుంబానికి, నాయకత్వానికి, కువైట్ ప్రజలకు ఆయన తన సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా Xలో పోస్ట్‌ చేసిన ప్రధాని..  షేక్ నవాఫ్ మరణం చాలా బాధకు గురి చేసిందన్నారు.  

కువైట్‌ పాలక ఎమిర్‌ షేక్‌ నవాఫ్‌ అల్‌-అహ్మద్‌ అల్‌-జాబర్‌ అల్‌-సబా మృతికి నివాళిగా భారత ప్రభుత్వం డిసెంబర్ 17న ఒక రోజు సంతాప దినాన్ని ప్రకటించింది. కువైట్ ఎమిర్ మృతి నేపథ్యంలో డిసెంబర్ 17 (ఆదివారం)న భారతదేశం అంతటా ఒకరోజు సంతాప దినం నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై దేశం అంతటా జాతీయ జెండా సగం వరకే ఎగురవేయబడుతుంది.