ఏపీలోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రారంభించారు ప్రధాని మోడీ. శనివారం ( ఆగస్టు 1 ) ఉదయం భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ సీఎం చంద్రబాబుతో కలిసి ఎయిర్పోర్టు టర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అంతకు ముందు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్,కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మోడీకి స్వాగతం పలికారు.
గిరిజన సాంప్రదాయ నృత్యం థింసాతో ప్రధాని మోడీకి ఘనస్వాగతం ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఒకే రంగు దుస్తులతో 13 వేల మంది కళాకారులు నిర్వహించిన ఈ అతిపెద్ద స్వాగతానికి అతిపెద్ద థింసా నృత్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.
ఎయిర్ పోర్టు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఏర్పాటు ఆకట్టుకునేలా భారీ స్థాయిలో ఏటికొప్పాక కళాకృతి ఆకట్టుకుంది. ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో ఏపీ సంస్కృతీ ఉట్టిపడేలా తోలు బొమ్మలు, బొబ్బిలి వీణలు, నాదస్వరం,లేపాక్షి నంది చిత్రాలతో పాటు బంగినపల్లి మామిడి వంటి చిత్రాలతో అలంకరించారు.
