తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం ( మే 10 ) హైదరాబాద్ కు చేరుకున్న మోడీ గచ్చిబౌలిలోని సాయిసింధు ఆసుపత్రిని ప్రారంభించారు ప్రధాని మోడీ. ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీ అక్కడి నుంచి హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గచ్చిబౌలికి చేరుకొని సాయి సింధు ఆసుపత్రిని ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు మోడీ.
అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు మోడీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మోడీ. తెలంగాణలో బీజేపీ సర్కార్ రాబోతుందని అన్నారు ప్రధాని మోడీ. బెంగాల్ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని...ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినోళ్లను ప్రజలు ఓడించారని... బెంగాల్ లో బీజేపీ గెలుపుతో బానిస సంకెళ్లు తెగాయని..మమత నియంతృత్వాన్ని బెంగాల్ ప్రజలు తిరస్కరించారని అన్నారు మోడీ.
►ALSO READ | ఏడాది పాటు బంగారం కొనొద్దు.. ప్రధాని మోడీ కీలక సూచన
కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి ఉంటుందని అన్నారు మోడీ. బెంగాల్ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారని... కుటుంబ పార్టీలకు దేశంలో చోటు లేదని అన్నారు. మూడు స్థానాలున్న బెంగాల్ లో నేడు 200 మార్క్ దాటామని అన్నారు. బీజేపీకి మొదట 2 ఎంపీ సీట్లు ఉంటే.. 1 తెలంగాణ నుంచే అని అన్నారు.
