ఏడాది పాటు బంగారం కొనొద్దు.. ప్రధాని మోడీ కీలక సూచన

ఏడాది పాటు బంగారం కొనొద్దు.. ప్రధాని మోడీ కీలక సూచన

ఏడాది పాటు బంగారం కొనొద్దంటూ పిలుపునిచ్చారు మోడీ. ఆదివారం ( మే 10 ) పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు మోడీ. అంతర్జాతియ పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని.. ఏడాదిపాటు బంగారం కొనడం ఆపేద్దామంటూ పిలుపునిచ్చారు మోడీ.

కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ లో సమస్యలు వచ్చాయని.. యుద్ధాలతో పొరుగుదేశాలతో చమురు ధరలు పెరిగాయని.. ఆ ధరల భారాన్ని దేశ ప్రజలపై పడకుండా చూశామని అన్నారు. దేశంలో ఏర్పడ్డ పెట్రోల్, డీజిల్ కొరత వివిధ దేశాలతో మాట్లాడి అధిగమిస్తామని అన్నారు మోడీ. దీర్ఘకాలంలో చమురు వినియోగాన్ని మనం తగ్గించుకోవాలని..ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని అన్నారు మోడీ.

►ALSO READ | తెలంగాణలో బీజేపీ సర్కార్ రాబోతుంది: ప్రధాని మోడీ

రైల్వే రంగంలో డీజిల్ వినియోగం గణనీయంగా తగ్గిస్తున్నామని..సమీప భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ అవసరం భారీగా తగ్గుతుందని .. చమురు వాడకం తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందని అన్నారు మోడీ. పండగలు, శుభకార్యాలకు బంగారం కొనడం తగ్గించాలని అన్నారు. ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయాలని అన్నారు. బంగారం దిగుమతులు తగ్గితే..విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుందని అన్నారు మోడీ.