తెలంగాణలో బీజేపీ సర్కార్ రాబోతుందని అన్నారు ప్రధాని మోడీ. ఆదివారం ( మే 10 ) హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు మోడీ.బెంగాల్ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని...ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినోళ్లను ప్రజలు ఓడించారని... బెంగాల్ లో బీజేపీ గెలుపుతో బానిస సంకెళ్లు తెగాయని..మమత నియంతృత్వాన్ని బెంగాల్ ప్రజలు తిరస్కరించారని అన్నారు మోడీ.
కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి ఉంటుందని అన్నారు మోడీ. బెంగాల్ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారని... కుటుంబ పార్టీలకు దేశంలో చోటు లేదని అన్నారు. మూడు స్థానాలున్న బెంగాల్ లో నేడు 200 మార్క్ దాటామని అన్నారు. బీజేపీకి మొదట 2 ఎంపీ సీట్లు ఉంటే.. 1 తెలంగాణ నుంచే అని అన్నారు.
►ALSO READ | HICC మీటింగ్ లో మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు...కలిసి పని చేద్దాం.. మాతో కలువు రేవంత్...!
తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు మోడీ. వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో బీజేపీ సర్కార్ ఏర్పాటు కావాలని అన్నారు. రాష్ట్రాల అభివృద్దే దేశ అభివృద్ధి అని...తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి వేలకోట్లు వెచ్చించామని... తెలంగాణను, హైదరాబాద్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు మోడీ.
