హైదరాబాద్ లోని HICC మీటింగ్ లో మాట్లాడుతూ సీఎం రేవంత్ ను ఉద్దేశించి చమత్కారాలు విసిరారు పీఎం మోడీ.ప్రధాని మోడీ మాట్లాడటానికి ముందు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. తాను రాజకీయాలు మాట్లాడబోనంటూ... దేశ అభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీకి సహకరించారంటూ గుర్తు చేశారు సీఎం రేవంత్.
ఈ క్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తాను కూడా రాజకీయాలు మాట్లాడబోనని.. గుజరాత్ కు ఎన్ని నిధులు ఇస్తున్నామో.. తెలంగాణకు కూడా అంతే నిధులు ఇస్తున్నామని అన్నారు. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే మాతో కలవాలంటూ సీఎం రేవంత్ కు పిలుపునిచ్చారు మోడీ.
►ALSO READ | తెలంగాణను నెంబర్ వన్ చేయడమే మా లక్ష్యం: సీఎం రేవంత్
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ కు సహకరించినట్లు ఇప్పుడు తెలంగాణకు సహకరించాలని సీఎం రేవంత్ కోరారని... అలా చేస్తే ఇప్పుడు వస్తున్న నిధులలో సగమే వస్తాయి.. అవే చాలా అంటూ ప్రశ్నించారు మోడీ. రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోవడంలో తప్పు లేదని..అందుకే మేము అని రాష్ట్రాలను అభివృద్ధిలో భాగం చేస్తున్నామని అన్నారు.
