సికింద్రాబాద్ లో వందేభారత్ రైలు ప్రారంభించిన మోడీ

సికింద్రాబాద్ లో వందేభారత్ రైలు ప్రారంభించిన  మోడీ

హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.  సికింద్రాబాద్ తిరుపతి మధ్య ప్రయాణించే ఈ రైల్లో మొత్తం 530 మంది ప్రయాణికులకు సరిపడా సీట్లు ఉంటాయి. సికింద్రాబాద్‌లో ఉదయం బయల్దేరి మధ్యాహ్నానికి తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు నడవనుంది. అయితే తొలి రోజు సాధారణ ప్రయాణికులను అనుమతించారు. ట్రైన్ లో విద్యార్థులతో మోడీ కాసేపు సంభాషించారు.  ఏప్రిల్ 9వ తేదీ నుంచి రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. మరికాసేపట్లో పరేడ్ గ్రౌండ్ లో జరిగే సభలో పాల్గొని మోడీ ప్రసంగించనున్నారు.