
న్యూఢిల్లీ: గవర్నమెంట్ బాండ్ల (సెక్యూరిటీల) లో రిటెయిల్ ఇన్వెస్టర్లు డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయడానికి వీలు కల్పించే స్కీమ్‌ను ప్రధాని మోడీ శుక్రవారం లాంచ్ చేశారు. ఆర్‌బీఐ తీసుకొచ్చిన రిటెయిల్ డైరెక్ట్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ స్కీమ్‌లను మోడీ లాంచ్ చేశారు. ఈ స్కీమ్‌ల వలన ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లకు అవకాశాలు పెరుగుతాయని, ఏదైనా సమస్య వస్తే తీర్చడానికి వీలుగా గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం మెరుగుపడుతుందని అన్నారు. రిటెయిల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా చిన్న ఇన్వెస్టర్లు కచ్చితంగా లాభాలను ఇచ్చే సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేయగలుగుతారని ఆయన పేర్కొన్నారు. దీంతో దేశాన్ని డెవలప్ చేయడానికి అవసరమయ్యే ఫండ్స్ ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆర్‌బీఐ–ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌తో ‘వన్ నేషన్–వన్ అంబుడ్స్‌మన్’ వాస్తవంగా మారుతుందని మోడీ పేర్కొన్నారు.
ట్రెజరీ బిల్లులలో కూడా చిన్న ఇన్వెస్టర్లు..
ప్రభుత్వ బాండ్ మార్కెట్‌ను చిన్న ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్‌బీఐ రిటెయిల్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇష్యూ చేసే సెక్యూరిటీలను చిన్న ఇన్వెస్టర్లు డైరెక్ట్‌గా కొనుక్కోవచ్చు. ఆర్‌బీఐ డైరెక్ట్ స్కీమ్ కింద ఒక వెబ్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. తాము కొన్న ప్రభుత్వ సెక్యూరిటీలను ఇన్వెస్టర్లు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వం ఇష్యూ చేసే ట్రెజరీ బిల్లులు, స్టేట్ డెవలప్‌మెంట్ లోన్లు, సావరిన్ గోల్డ్ బాండ్లు, ప్రభుత్వ బాండ్లను సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. ఇటువంటి తరహా స్కీమ్ కేవలం కొన్ని దేశాల్లోనే ఉంది.