పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులు

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన  జవాన్లకు ప్రధాని మోడీ నివాళులు

 పుల్వామా ఉగ్రదాడి జరిగి నాలుగేళ్లవుతోంది. ఉగ్రదాడిలో  అమరవీరులైన  సీఆర్‌పీఎఫ్ జవాన్లకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. సైనికుల  త్యాగాన్ని ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు.  

పుల్వామాలో నాలుగేళ్ల క్రితం ఇదే రోజున వీర జవాన్లను  మనం కోల్పోయాం. వారి సేవలను  స్మరించుకుంటున్నాను. జవాన్ల  అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మరువలేం. భారతదేశాన్ని బలమైన శక్తిగా  నిర్మించడానికి జవాన్ల  ధైర్యం మనకు ఆదర్శం... అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. 

 2019  ఫిబ్రవరి 14 జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని లెత్‌పోరా వద్ద నేషనల్ హైవేపై CRPF సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరవీరులయ్యారు.