
అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి.. ఢిల్లీ పాలం టెక్నికల్ ఎయిర్ పోర్టులో బీజేపీ గ్రాండ్ గా వెల్కం చెప్పింది. ఎయిర్ పోర్టు బయట స్వాగతసభను ఏర్పాటు చేసింది. సభలో మాట్లాడారు మోడీ.
ప్రపంచవ్యాప్తంగా భారత దేశంపట్ల గౌరవం పెరిగిందన్నారు ప్రధాని మోడీ. అమెరికాలో ఎక్కడికెళ్లినా హౌడీ మోడీ నినాదాలే మారుమోగాయన్నారు. 2014లో ప్రధాని అయ్యాక అమెరికా వెళ్లాననీ.. ఇప్పుడు కూడా వెళ్లి వచ్చాననీ.. ఐదేళ్లలో చాలా మార్పు చూశానని అన్నారు. ఇదంతా 130కోట్ల మంది భారతీయుల వల్లే సాధ్యమైందని చెప్పారు.
సర్జికల్ స్ట్రైక్ జరిగి నేటితో మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఆ రోజును గుర్తు చేసుకున్నారు మోడీ. సైనికుల ధైర్యసాహసాలను కొనియాడారు. సభ పూర్తయ్యాక కొద్ది దూరం నడుస్తూ వెళ్లి కార్యకర్తలకు అభివాదం చేశారు మోడీ.