కరోనాపై మోడీ సమీక్ష.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్

కరోనాపై మోడీ సమీక్ష.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్

దేశంలో కరోనా పరిస్థితులపై ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమీక్ష చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పెరుగుతున్న కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోడీ.. కరోనా కట్టడిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా, థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.. రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక నిఘా  పెట్టింది. ముమ్మర వ్యాక్సినేషన్ తో పాటు.. కఠిన నిబంధనలు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టింది. మరోవైపు దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే లక్షా 59 వేల 632 కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా మూడో రోజు లక్షకు పైగా కేసులు రావడం, మరోవైపు దేశంలో కరోనా పాజిటివిటీ రేటు శాతం దాటిన నేపథ్యంలో ప్రధాని మోడీ రివ్యూలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.