జర్మనీ నుండి యూఏఈ వెళ్లిన ప్రధాని మోడీ

జర్మనీ నుండి యూఏఈ వెళ్లిన ప్రధాని మోడీ

ప్రధాని మోడీ యూఏఈ వెళ్లారు. జర్మనీలో జరిగిన జీ7 సమ్మిట్ పాల్గొన్న మోడీ అక్కడినుండి యూఏఈ వెళ్లారు. యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇటీవలె మరణించారు. ఆయన మృతికి ప్రధాని సంతాపం తెలపనున్నారు. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 2004 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా పనిచేశారు.

ఇక జర్మనీ జీ7 దేశాల సమిట్ సందర్భంగా ‘ఇన్వెస్టింగ్ ఇన్ ఏ బెటర్ ఫ్యూచర్: క్లైమేట్, ఎనర్జీ, హెల్త్’ అంశంపై జరిగిన సెషన్​లో మోడీ మాట్లాడారు. వాతావరణ మార్పులపై ఇండియా చేస్తున్న ప్రయత్నాలకు సంపన్న దేశాలు మద్దతివ్వాలని కోరారు. దేశంలో కొత్త క్లీన్ ఎనర్జీ టెక్నాలజీల్లో ఎంతో పెద్ద మార్కెట్ ఉందని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. క్లీన్ ఎనర్జీ రంగంలో ఇన్నోవేషన్, రీసెర్చ్, మాన్యుఫాక్చరింగ్​పై పెట్టుబడులకు ఎంతో స్కోప్ ఉందన్నారు.  
పర్యావరణ పరిరక్షణకు ఇండియా ప్రాచీన కాలం నుంచే ప్రాధాన్యం ఇస్తోందని మోడీ అన్నారు. ప్రపంచ జనాభాలో 17 శాతం ఉన్న ఇండియన్ లు.. 5 శాతం కార్బన్ ఉద్గారాలను మాత్రమే విడుదల చేస్తున్నారని తెలిపారు. ఇండియా నుంచి కార్బన్ ఉద్గారాలు ఇంత తక్కువగా ఉండటానికి ప్రకృతితో కలిసి జీవించేలా ఉన్న లైఫ్ స్టైలే కారణమన్నారు. శతాబ్దాల తరబడి బానిసత్వంలో మగ్గినా కూడా ఇండియన్ల జీవన విధానం మారలేదన్నారు. దేశవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బులు, వంట గ్యాస్ పంపిణీ చేయడం వల్ల కూడా కార్బన్ ఎమిషన్స్ తగ్గాయన్నారు.  

దగ్గరగా వచ్చి మోడీని పలకరించిన బైడెన్  

జీ7 సదస్సుకు ప్రధాని మోడీతో పాటు సెనెగల్, ఇండోనేసియా, సౌతాఫ్రికా, అర్జెంటినా ప్రెసిడెంట్లు మ్యాకీ సాల్,  జోకో విడొడొ, సిరిల్ రామఫోసా, ఆల్బర్టో ఫెర్నాండెజ్ గెస్ట్ లీడర్స్ గా హాజరయ్యారు. సదస్సుకు ముందుగా కెనడా పీఎం ట్రూడోతో ప్రధాని మోడీ మాట్లాడుతుండగా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ వెనక నుంచి నడుచుకుంటూ వచ్చి మోడీని పలకరించారు. ఇద్దరూ ఆప్యాయంగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రన్​ తదితరులతో కూడా మోడీ మాట్లాడారు.  తర్వాత జీ7(అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్) దేశాల అధినేతలతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అలాగే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రన్​తో, జర్మనీ చాన్స్ లర్ ష్కోల్జ్, సౌతాఫ్రికా ప్రెసిడెంట్ రామఫోసాతో మోడీ భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

చైనాకు కౌంటర్ గా జీ7 బిగ్ ప్లాన్  

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను కలుపుతూ చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ కు కౌంటర్​గా జీ7 దేశాధినేతలు భారీ ప్లాన్ కు శ్రీకారం చుట్టారు. ఇండియా, తదితర దేశాల్లో 600 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ కు ప్రత్యామ్నాయంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘పార్టనర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్(పీజీఐఐ)’ పేరుతో ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆదివారం నాటి సెషన్ లో జీ7 లీడర్లు అంగీకరించారు.