ప్రధాని మోడీ జూన్ 22న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తో సమావేశం కానున్నారు. మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫస్ట్ లేడీ జిల్ బిడెన్ మోడీకి రాష్ట్ర విందు ఇవ్వనున్నారని వెల్లడించింది.
ప్రధాని మోడీ పర్యటనతో అమెరికా, భారత్ మధ్య స్నేహ బంధం మరింత పెరుగుతుందని భారతీయులు, అమెరికన్ల స్నేహాన్ని ధృవీకరిస్తుందని వైట్ హౌజ్ తెలిపింది. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే భారత్ సహాయం కావాలని అగ్రరాజ్యం అమెరికా గుర్తించింది. గతంలో మోడీ 2021లో అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ వైట్ హౌస్ లో బిడెన్ తో మోడీ సమావేశం అయ్యారు.