షాద్‌నగర్, వెలుగు: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికీ త్వరలోనే పైపు లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లను సమకూర్చనున్నట్లు మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం వెల్లడించారు. శుక్రవారం 23వ వార్డులో జరుగుతున్న అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్లైన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బరువున్న సిలిండర్లతో ఇబ్బంది పడకుండా, నేరుగా వంటింటికే అత్యంత భద్రతా ప్రమాణాలతో 24/7 గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పెంటయ్యతో పాటు పలువురు కాలనీ వాసులు, నాయకులు పాల్గొన్నారు.
