ఓల్డ్‌సిటీ, వెలుగు: లైంగిక దాడుల నుంచి చిన్నారులను రక్షించేందుకు పోక్సో చట్టం తీసుకువచ్చారని రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ డాక్టర్ రమాదేవి అన్నారు. బండ్లగూడ ఇస్లామియా లా కాలేజీలో పోక్సో యాక్ట్‌పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడారు. మైనర్లను లైంగికంగా వేధిస్తే ఈచట్టం ద్వారా కఠిన శిక్ష పడుతుందన్నారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.రాధిక, ఆధ్యాపక బృందం పాల్గొన్నారు.
