కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు సంచలనంగా మారింది. మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో పెట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31న మొయినాబాద్‌లో తనపై అసభ్యంగా ప్రవర్తించారని, బలవంతంగా మద్యం తాగించే ప్రయత్నం చేశారని ఆ బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది.
అయితే ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన హనీట్రాప్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ కార్యాలయం ప్రకటన రిలీజ్ చేసింది. కోర్టు సినిమా తరహాలో లేని కేసును సృష్టించి బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారని తెలిపింది. ఓ మహిళ తన కూతురిని అడ్డుపెట్టుకుని బండి సంజయ్ కుమారుడిని ట్రాప్ చేసి సుమారు రూ. 2 నుంచి 3 కోట్లు డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకపోవడంతోనే బాలిక ఫోక్సో కేసును అస్త్రంగా వాడుకుంటుందని ఆరోపిస్తూ మహిళపై బండి సంజయ్ కొడుకు కరీంనగర్ పీఎస్ లో ఇప్పటికే ఫిర్యాదు చేశారని వెల్లడించింది.
డబ్బులు ఆశించిన మేరకు రాకపోవడంతో మహిళ మీడియాను ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తోంది. కేవలం రాజకీయంగా ,ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకే ఈ హనీట్రాప్ డ్రామా ఆడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఆ మహిళా కార్యకలాపాలు, గతంలో ఆమె ఇలాంటి నేరాలకు పాల్పడిందా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారని బండి సంజయ్ కార్యాలయం ప్రకటన రిలీజ్ చేసింది
