ఎన్నికల బందోబస్త్ కు బాడీవార్న్‌ కెమెరాలు

ఎన్నికల బందోబస్త్ కు బాడీవార్న్‌ కెమెరాలు
  • అల్లర్లు, గొడవలు జరిగితే పక్కా ఎవిడెన్స్ కోసం
  • మూడు కమిషనరేట్ల పరిధిలో 200 కెమెరాలు

హైదరాబాద్‌, వెలుగు: గ్రేటర్ ఎలక్షన్స్ లో ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. క్యాండిడేట్లు, పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన, తప్పు చేసి తప్పించకునేందుకు ప్రయత్నించిన అలాంటి చాన్స్ లేకుండా ఈసారి బాడీవార్న్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు వీటిని ఉపయోగించే వారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేసే వారిని మెడలో ఉండే బాడీవార్న్‌  కెమెరాలతో రికార్డ్ చేసేవారు. దీంతో ఇన్సిడెంట్ లో తప్పు ఎవరిదన్నది స్పష్టంగా తెలిసిపోయింది. పోలీసుల సైడ్ నుంచి తప్పున్న దొరికిపోయే వారు. ఎన్నికల టైమ్ లో చాలా మంది క్యాండిడేట్స్, పార్టీ కార్యకర్తలు పోలీసులతో ఆర్గ్యుమెంట్ కి దిగే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనల్లో సరైన ఆధారాలుండాలన్న ఉద్దేశంతో బాడీవార్న్ కెమెరాలను వినియోగిస్తున్నారు.

ఫుటేజ్ ఆధారంగా కేసులు

మొన్నటి లోక్ సభ, అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కెమెరాలు వాడటం ద్వారా చాలా కేసులను పక్కా ఆధారాలతో నమోదు చేయగలిగారు. ఈ సారి గ్రేటర్ లోని మూడు కమిషనరేట్ పరిధిలో మొత్తం 200 కెమెరాలను వాడుతున్నారు. ర్యాలీల్లో కనీసం రెండు బాడీవార్న్ కెమెరాలతో నిఘా పెడుతారు. గతంలో గొడవలు సృష్టించిన వారు, అనుమానాస్పదంగా వ్యవహరించిన వారి డేటాను ఇప్పటికే కలెక్ట్ చేశారు. అలాంటి వారితో డీల్ చేసేప్పుడు కచ్చితంగా బాడీవార్న్ కెమెరాలను వినియోగించనున్నారు. ఎస్సై, ఏఎస్సై స్థాయి అధికారులు వీటిని క్యారీ చేస్తారు. శనివారం నుంచి ప్రారంభమైన షోడ్‌ షోలు పార్టీల ప్రచారాల్లో బాడీవార్న్‌ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. ఆడియో, వీడియో స్పష్టంగా క్యాప్చర్ అయ్యేలా డిజిటల్‌ కెమెరాలున్నాయని పోలీసులు తెలిపారు.

కంట్రోల్ సెంటర్ కు అటాచ్ పోలీసులు అలెర్ట్​గా ఉండాలి

రాచకొండ సీపీ మహేశ్ భగవత్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో పోలీసులు అలెర్ట్​గా ఉండాలని రాచకొండ సీపీ మహేశ్‌‌‌‌భగవత్‌‌‌‌ సూచించారు. కమిషనరేట్‌‌‌‌ పరిధిలోని 28 డివిజన్ల సెక్యూరిటీపై ఆయన సమీక్ష జరిపారు. 13 పోలీస్‌‌‌‌ స్టేషన్ల పరిధిలో జరిగే ఎన్నికల్లో  10 వేల మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామన్నారు. 53 అత్యంత సమస్యాత్మక, 512 సమస్యాత్మక, 1072 సాధారణ పోలింగ్ స్టేషన్లు గుర్తించామని పేర్కొన్నారు. ఏసీపీ స్థాయి అధికారిని నోడల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా నియమించామని, 6 ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌‌‌‌తో చెకింగ్‌‌‌‌ చేస్తున్నామని వివరించారు. దీంతో పాటు 29 చెక్ పోస్ట్‌‌‌‌లు, 90 పికెట్స్ ఏర్పాటు చేశామన్నారు. 353 ఆయుధాలు డిపాజిట్ చేయించామని సమస్యాత్మక ప్రాంతాల్లో 10 మౌంటెడ్ కెమెరాల వెహికల్స్‌‌‌‌తో నిఘా పెట్టామన్నారు. 89 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేసి140 నాన్ బెయిలబుల్ వారెంట్స్‌‌‌‌ ఎగ్జిక్యూట్‌‌‌‌ చేశామన్నారు. 6 కౌంటింగ్ సెంటర్ల వద్ద  మూడు అంచెల భద్రతకు ఏర్పాట్లు చేశామన్నారు.