గాంధీ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్.. ఆరు నెలలుగా కొలువులో

గాంధీ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్.. ఆరు నెలలుగా కొలువులో

గాంధీ హాస్పిటల్ లో నకిలీ డాక్టర్ దొరికిన ఘటన….. రోగుల భద్రతపై అనుమానం కలిగిస్తోంది. ఏకంగా ఆరు నెలల నుంచి ఓ ఫేక్ డాక్టర్ విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. న్యూరో విభాగంలో పనిచేస్తున్న ఆ డాక్టర్ కాని డాక్టర్ ను…. పీజీ వైద్యులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు.

WHO డా.సుబ్రజిత్ పాండే పేరుతో గుర్తింపు కార్డు కలిగి ఉన్న ఆ వ్యక్తిని చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ముంబై నుంచి వచ్చినట్టు సమాచారం. ఇంకా మరో ఇద్దరు నకిలీ డాక్టర్లు గాంధీ ఆస్పత్రిలో తిరుగుతున్నారనే సమాచారంతో వారిని కూడా పట్టుకునే పనిలో పడ్డారు. ఆసుపత్రిలోకనీస భద్రత లేకుండా పోయిందంటున్నారు రోగులు.

ఈ విషయంపై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ మాట్లాడుతూ.. సదరు నకిలీ డాక్టర్ ఆసుపత్రిలోని ఏ వార్డులో కూడా ఎవ్వరికీ ట్రీట్‌మెంట్ చేయలేదని, ఏదో పర్సనల్ మోటో తోనే ఆసుపత్రిలోకి వచ్చి క్యాంటీన్ లో భోంచేసే వాడని చెప్పారు. సీసీ ఫుటేజీ ద్వారా అతను ఏ ఏ  వార్డుల్లోకి ప్రవేశించాడనే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.

police-arrest-a-fake-doctor-in-gandhi-hospital