
చందానగర్, వెలుగు: చందానగర్ పరిధిలోని ఖజానా జ్యువెల్లరీలో దోపిడీ చేసిన ఆరుగురిలో ముగ్గురు దొంగలు స్పెషల్టీమ్స్కు చిక్కినట్టు తెలుస్తోంది. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా, పుణెలో ఒకరు, బీదర్‌లో మరో ఇద్దరు పట్టుబడ్డట్టు సమాచారం. ఈ నెల 12న ఉదయం ఆరుగురు దుండగులు చందానగర్గంగారంలోని ఖజానా జ్యువెల్లరీకి వచ్చి డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరిపి వెండి వస్తువులతో పరారైన సంగతి తెలిసిందే.
రెండు బైకులపై పటాన్చెరు వైపు పారిపోగా, సైబరాబాద్ సీపీ 12 స్పెషల్టీమ్స్ఏర్పాటు చేశారు. ఇందులో రాజేంద్రనగర్ జోన్‌కు చెందిన బృందానికి పుణెలో ఒకరు దొరకగా, ఇతడు ఇచ్చిన సమాచారంతో బీదర్‌లో మరో ఇద్దరు చిక్కినట్టు తెలుస్తోంది. వీరిని నేడో, రేపో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.