మియాపూర్ లో నిర్మాణంలో ఉన్న ఇండ్లే టార్గెట్.. కారులో వచ్చి విద్యుత్ వైర్లు చోరీ

మియాపూర్ లో  నిర్మాణంలో ఉన్న ఇండ్లే టార్గెట్.. కారులో వచ్చి  విద్యుత్  వైర్లు చోరీ

హైదరాబాద్ లో కొత్తగా ఇండ్లు కట్టే వాళ్లు జాగ్రత్తగా ఉండండి. ఇంటికి అవసరమయ్యే కరెంట్ వైర్లు, నళ్లాలు, డోర్లు,  ఇలా చాలా మెటీరియల్స్ కొనుగోలు చేసి అక్కడే పెడుతుంటారు.  అయితే నిర్మాణంలో ఉన్న ఇండ్లనే టార్గెట్ గా చేసుకున్న కొందరు దొంగలు సామాగ్రిని ఎత్తుకెళ్తున్నారు. లేటెస్ట్ గా మియాపూర్ లో ఇద్దరు దొంగలు కరెంట్ వైర్లు ఎత్తుకెళ్లి పోలీసులకు అడ్డంగా దొరికారు.  

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ తీగలను దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను  పోలీసులు అరెస్ట్ చేశారు.  నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు నిందితులు.  నిందితుల నుంచి మారుతి స్వీఫ్ట్ కారు బజాజ్ పల్సర్ బైకు నాలుగు లక్షల విలువైన విద్యుత్ వైర్లు 81 బేండల్స్ ను  స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

 మియాపూర్ ఏసీపీ వివరాల ప్రకారం..  బీహార్ కు  చెందిన దీలిప్ కుమార్ హఫీజ్ పేటలో నివాసం ఉంటున్న నిశాల్ కరల్కర్ స్నేహితులు..జల్సాలకు అలవాటు పడిన నిందితులు నిర్మాణంలో ఉన్న భవనాల్లో నిల్వ చేసిన విద్యుత్ వైర్లు బేండల్ లను దొంగిలిస్తారు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రి పుట కారులో వెళ్లి విద్యుత్ వైర్లు ఎత్తుకెళ్తారు.  నిందితులపై గతంలో ఎనిమిది కేసులు మియాపూర్ లో మూడు కేసులు మొత్తం 11 కేసులు ఉన్నాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాం అని తెలిపారు.