సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌ - నిందితుల్లో ఐదుగురు మైనర్లు

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌ - నిందితుల్లో ఐదుగురు మైనర్లు

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌సికింద్రాబాద్‌‌‌‌, వెలుగు : రాత్రి టైంలో ఒంటరిగా వెళ్తున్న వారి వద్ద నుంచి సెల్‌‌‌‌ఫోన్లు లాక్కొని పారిపోతున్న ఏడుగురిని సికింద్రాబాద్‌‌‌‌ గోపాలపురం పోలీసులు బుధవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. జగద్గిరిగుట్ట హనుమాన్‌‌‌‌ నగర్‌‌‌‌కు చెందిన కొంగ్టి జాన్సన్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ సోహైల్‌‌‌‌తో పాటు మరో ఐదుగురు మైనర్లతో కలిసి ఈజీ మనీ కోసం చోరీలు చేరేందుకు ప్లాన్‌‌‌‌ చేశాడు. ఇందులో భాగంగా ఓ ఆటోను దొంగిలించి రాత్రి టైంలో తిరుగుతూ ఒంటరిగా వెళ్లే వారి వద్ద నుంచి సెల్‌‌‌‌ఫోన్లు లాక్కొని పారిపోతున్నారు. మోండా మార్కెట్‌‌‌‌ ఏరియాకు చెందిన రోషన్‌‌‌‌ కుమార్‌‌‌‌ ఈ నెల 23న రాత్రి 1.30 గంటలకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే టైంలో ఆటోలో వచ్చిన ముఠా సభ్యులు రోషన్‌‌‌‌ కుమార్‌‌‌‌ సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ను లాక్కొని ఉడాయించారు. అతడి ఫిర్యాదుతో గోపాలపురం పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్‌‌‌‌ చేశారు. బుధవారం చిలకలగూడ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి ఆరు సెల్‌‌‌‌ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. జాన్సన్‌‌‌‌, సోహైల్‌‌‌‌ను రిమాండ్‌‌‌‌కు తరలించగా, ఐదుగురు మైనర్లను జువైనల్‌‌‌‌ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

చైన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ కేసులో మరో ఇద్దరు..

జీడిమెట్ల, వెలుగు : చైన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బగ్గు వెంకటరమణ, హిమండి సంతోష్‌‌‌‌ కుమార్‌‌‌‌ కొంపల్లిలో ఉంటున్నారు. వెంకటరమణ ఓ ఫుడ్‌‌‌‌ డెలివరీ సంస్థలో పనిచేస్తుండగా, సంతోష్‌‌‌‌ కుమార్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ స్కూల్‌‌‌‌ బస్‌‌‌‌ డ్రైవర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఇందులో భాగంగా ఈ నెల 21న అల్వాల్‌‌‌‌ ఏరియాలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి 3.7 తులాల బంగారు గొలుసులను లాక్కెళ్లారు. బాధితురాలు అల్వాల్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేష్‌‌‌‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేసి కొంపల్లిలో వెంకటరమణ, సంతోష్‌‌‌‌కుమార్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేశారు. వారి వద్ద నుంచి చైన్‌‌‌‌తో పాటు రెండు సెల్‌‌‌‌ఫోన్లు, బైక్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు.