ట్రోలింగ్ కు పాల్పడుతున్న 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

ట్రోలింగ్ కు పాల్పడుతున్న 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రజాప్రతినిధులు, మహిళలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు పాల్పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలలోని  8 మందిని  సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అట్టాడ శ్రీనివాస రావు, చిరసాని మణికంఠ, బద్దంజి శ్రవణ్, మోతం శ్రీను,పెరిక నాగవెంకట కిరణ్, వడ్లూరి నవీన్, బొల్లి చంద్రశేఖర్, బిల్ల శ్రీకాంత్  లు అరెస్ట్ అయిన వారిలో  ఉన్నారు. ట్రోలింగ్ లపై 20 కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. మరో 30 మంది ట్రోలర్స్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

మహిళలను కించపరిచే విధంగా ట్రోలింగ్ చేస్తున్నట్లుగా తెలిపారు. సబ్ స్రైబర్స్, వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారని వెల్లడించారు. ఈ మధ్య ఎమ్మెల్సీ కవితపై ఎక్కువగా ట్రోలింగ్ జరిగినట్లుగా గుర్తించామని అన్నారు.  మహిళల ఫొటోలను అసభ్యంగా తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రభుత్వంలోని పెద్దలపైనా కూడా మార్ఫింగ్ ఫొటోల పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. ప్రధానంగా మహిళలను కించపరిచే విధంగా ట్రోల్స్, మీమ్స్ చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు.