మరుగుదొడ్డి కట్టించి ఉదారతను చాటుకున్న పోలీస్

మరుగుదొడ్డి కట్టించి ఉదారతను చాటుకున్న పోలీస్

సిద్దిపేట జిల్లా: అనాధలై దివ్యాంగులుగా ఉన్న కుటుంబానికి మరుగుదొడ్డి కట్టించి ఉదారతను చాటుకున్నారు ఓ ఎస్ఐ. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన సంతోష, కొమురయ్య దివ్యాంగులు. టాయిలెట్ నిర్మాణానికి సహకరించాలని సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ కు దరఖాస్తు పెట్టుకున్నారు. కమిషనర్ ఆదేశాలతో.. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్.. అక్కన్నపేట ఎస్ఐ రవికి బాధ్యతలు ఇచ్చారు. నిరుపేద కుటుంబానికి మరుగుదొడ్డి నిర్మించడంతో పాటు.. బియ్యం, దుస్తులను ఏసీపీ చేతులమీదుగా అందించారు. కన్నకొడుకుల్లాగా పోలీసులు ఆదుకున్నారంటూ ఆ దివ్యాంగ దంపతులు కంటతడి పెట్టారు.