కూకట్పల్లి/ మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి, కేపీహెచ్బీ ప్రాంతాల్లో నివాస గృహాలే కేంద్రంగా సాగుతున్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. మేడిపల్లి పరిధిలోని సుమా రెసిడెన్సీలో బుధవారం రాత్రి జరిగిన దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని, రూ. 23 వేల, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
కేపీహెచ్బీ భగత్ సింగ్ నగర్లోని ఒక ఇంట్లో తనిఖీలు చేసిన బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు మరో ఆరుగురు పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. వీరి నుంచి ఏకంగా రూ. రూ.3 లక్షల నగదుతో పాటు 80 కాయిన్లు, 50 సెట్ల కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
