కస్టమర్ల KYC, ఫింగర్‌ప్రింట్లు మిస్ యూజ్..ఎయిర్ టెల్ సిమ్ డిస్ట్రిబ్యూటర్లు అరెస్ట్

కస్టమర్ల KYC, ఫింగర్‌ప్రింట్లు మిస్ యూజ్..ఎయిర్ టెల్ సిమ్ డిస్ట్రిబ్యూటర్లు అరెస్ట్

కస్టమర్ల KYC, ఫింగర్‌ప్రింట్లు దుర్వినియోగం చేసిన ఎయిర్​ సిమ్​ డిస్ట్రిబ్యూటర్ల అక్రమం దందా గుట్టు రట్టు చేశారు పోలీసులు.. వొడాఫోన్​ ఐడియా కస్టమర్ల పేర్లను, వారి కేవైసీ, ఫింగర్​ ప్రింట్లను వినియోగించి అక్రమంగా  దాదాపు 200 ఎయిర్ టెల్​ సిమ్​ లను యాక్టవేట్ చేసి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న ఇద్దరు  వ్యక్తులను  సీసీఎస్​ స్పెషల్​ క్రైం టీమ్​, నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 

అక్రమంగా ఎయిర్ టెల్​ సిమ్​ లను యాక్టివేట్​ చేసి అధిక ధరలకు అమ్ముతూ అడ్డదారిలో డబ్బులు సంపాదిస్తున్న   కడపజిల్లాకు చెందిన ఇద్దరుయువకులను ఆదివారం (జనవరి 18) సీసీఎస్​ స్పెషల్​ క్రైం టీమ్​, నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.  అక్రమంగా యాక్టివేట్​ చేసిన 184 సిమ్​ లను స్వాధీనం చేసుకున్నారు. అందులో 150 ఎయిర్​ టెల్​ సిమ్​ లు, 34  జియో సిమ్​ కార్టులు ఉన్నాయి. 

సిమ్​ డిస్ట్రిబ్యూటర్​ సెంటర్ నడుపుతూ కస్టమర్లకు తెలియకుండా వారి KYC, ఫింగర్​ ప్రింట్లను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు నిందితులు.  వొడాఫోన్​ ఐడియా కస్టమర్ల పేర్లపై ఎయిర్​ టెల్​ సిమ్​ లను యాక్టివేట్​ చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. నిందితులనుంచి 4 సెల్​ ఫోన్లు, అక్రమాలకు పాల్పడుతున్నట్లు చూపించే ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నాంపల్లి స్టేషన్​ లో అప్పగించారు.