వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

ఏప్రిల్ 17వ తేదీన T-SAVE ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్షం నేతలతో కలిసి తలపెట్టిన వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్ జామ్ కారణాలు చూపి, నిరాహార దీక్షకు అనుమతి నిరాకరించారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో తదుపరి కార్యాచరణపై పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ షర్మిల చర్చిస్తున్నారు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి అనుమతి తీసుకోవాలా..? లేక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయం వద్ద దీక్ష కొనసాగించాలా..? అనే దానిపై తమ నాయకులతో చర్చిస్తున్నారు వైఎస్ షర్మిల.