హైడ్రోజన్ పెరాక్సైడ్ తో పాల తయారీ..నిందితుడు అరెస్ట్

 హైడ్రోజన్ పెరాక్సైడ్ తో పాల తయారీ..నిందితుడు అరెస్ట్

యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాల తయారీ గుట్టును ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. వలిగొండ(మ)సంగెం గ్రామంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ,ధోల్పూర్ ఫ్రెష్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉపయోగించి పాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు కొలను జంగారెడ్డిని అరెస్ట్ చేసి..అతని నుంచి 200  లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా  హైడ్రోజన్ పెరాక్సైడ్ , 12  ప్యాకెట్ల ధోల్పూర్ ఫ్రెష్ స్కీముడ్ మిల్క్ పౌడర్ సీజ్ చేశారు. గత పది రోజుల్లో యాదాద్రి జిల్లాలోనే మూడు చోట్ల దాడులు చేసి కల్తీ పాల వ్యాపారులను పట్టుకోవడం గమనార్హం.