హైదరాబాద్, వెలుగు: జోర్డాన్‌లో జరిగిన 24వ ఏకేఎఫ్ అంతర్జాతీయ జూనియర్ కరాటే పోటీల్లో తెలంగాణ క్రీడాకారిణి బ్రహ్మదండి సత్యతేజ కాంస్య పతకాన్ని సాధించడంతో గురువారం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సన్మానించారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కరాటే క్రీడ వేగంగా దూసుకెళ్తుందని, సత్యతేజ సాధించిన ఈ అంతర్జాతీయ పతకమే ఇందుకు నిదర్శనమని ప్రశంసించారు. ఈ విజయంతో రాష్ట్రంలోని ఇతర కరాటే క్రీడాకారుల్లోనూ కొత్త ఉత్సాహం నిండిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
