- సీపీ సుమతి వెల్లడి
ఎల్బీనగర్, వెలుగు: మల్కాజిగిరి పోలీస్కమిషరేట్పరిధిలో ఈసారి నిమజ్జనాలకు ఈసారి గణేశ్ సురక్షా సంకల్ప్-2026 పేరుతో సమగ్ర భద్రతా ప్లాన్ను అమలు చేయనున్నట్టు సీపీ సుమతి తెలిపారు. సుమారు 15 వేల విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. నిమజ్జనం కోసం 5,874 మంది పోలీస్ సిబ్బంది పని చేస్తున్నారన్నారు.
వీరితోపాటు ఇతర విభాగాలు, బయటి యూనిట్ల నుంచి వచ్చే అధికారులు, అదనపు బలగాల సేవలను కూడా వినియోగించుకుంటున్నట్లు వివరించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రధాన చౌరస్తాలు, నిమజ్జన రూట్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఐదు వేల సీసీ కెమెరాలను గుర్తించి, వాటి ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
