విద్యుత్పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం ఆపాలి..విప్ అద్దంకి దయాకర్ ఫైర్

విద్యుత్పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం ఆపాలి..విప్ అద్దంకి దయాకర్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌‌‌నినో వల్ల దేశం మొత్తం విద్యుత్​ కష్టాలను ఎదుర్కొంటుందని, ఒక్క తెలంగాణలోనే ఈ సమస్య ఉన్నట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేయడంపై విప్ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ సమస్యలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆ రాష్ట్రాలకు బీఆర్ఎస్ నేతలు వెళ్లి చూసి వస్తే బాగుంటుందన్నారు.

పవర్ పోయి పరేషాన్ లో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పడు రాష్ట్రంలో పవర్ సమస్యపై ఆందోళనలకు పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ అబద్ధపు విష ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మవద్దని కోరారు. ఎంత ధర చెల్లించైనా సరే విద్యుత్​ను కొనుగోలు చేసి రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు.