సీరియల్ చూసి మర్డర్.. క్లూస్ లేకుండా చేసి..

సీరియల్ చూసి మర్డర్.. క్లూస్ లేకుండా చేసి..

జల్సాలకు అలవాటు పడ్డాడు.. ఈజీగా మనీ సంపాదించాలనుకున్నాడు. ఓ టీవీలో వచ్చే సీరియల్ తో పక్కా ప్లాన్ వేశాడు… టాక్సీ డ్రైవర్ ను  హత్యచేసి క్లూస్ లేకుండా అతని కారును తీసుకెళ్లి  అమ్మి సొమ్ము చేసుకున్నాడు.  కానీ  టెక్నాలజీ సాయంతో పోలీసులకు పట్టుబడ్డాడు. వరంగల్ కమిషనరేట్ లో జరిగింది ఈ సంఘటన. జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవపురం బస్టాప్ దగ్గర జనవరి 23 అర్థరాత్రి ఓ గుర్తుతెలియని డెడ్ బాడీ దొరికింది.. పోలీసుల విచారణలో చనిపోయింది హన్మకొండకు చెందిన డ్రైవర్ మడత నర్సింహగా గుర్తించారు. నర్సింహ హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉంటూ టాక్సీగా నడుపుతూ జీవిస్తున్నాడు. మృతుడి శరీరంపై గాయాలు ఉండడం, పెప్పర్ స్ప్రే చేయడం గుర్తించినా… హత్యకు సంబంధించిన ఎలాంటి అనవాళ్లు దొరకలేదు. క్లూస్ లేకుండా పక్కా స్కెచ్ తో మర్డర్ జరిగిందని గుర్తించిన పోలీసులు… టెక్నాలజీ సాయంతో ఎంక్వైరీ చేశారు. హంతకుడిని పట్టుకోవడంతో పాటు హత్య జరిగిన తీరుపై  పోలీసులు ఆశ్చర్యపోయారు.

పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన పరాంకుశం రోషన్ .. జల్సాలకు అలవాటు పడ్డాడు. కేబుల్ నెట్ వర్క్ లో పనిచేస్తున్న రోషన్ కు వచ్చే డబ్బులు అవసరాలకు సరిపోవట్లేదని భావించి…ఈజీగా మనీ సంపాదించాలనుకున్నాడు. టీవీ సీరియల్స్, సినిమాలు బాగా వాచ్ చేశాడు. ఓ సీరియల్ లో చూపించినట్టుగా ప్లాన్ చేసుకున్నాడు. ఆన్ లైన్ లో రెండు పెప్పర్ స్ప్రేలు కొన్నాడు. జనవరి 23న సాయంత్రం హన్మకొండకు వచ్చి ఒంటరి డ్రైవర్ ఉన్న కారు కోసం టార్గెట్ చేశాడు రోషన్.  హన్మకొండలో డ్రాప్ చేసి… హైదరాబాద్ వెళ్తున్న నర్సింహా కారును ఎంచుకున్నారు.  జనగామకి  కిరాయికి మాట్లాడుకున్నాడు. జనగామ చేరుకున్నాక… పనికాలేదంటూ కొన్ని షాపులు తిరిగాడు. పాలకుర్తికి తీసుకెళ్ళినా ప్లాన్ అమలు కాలేదు. మళ్ళీ హన్మకొండకు వస్తుండగా రాఘవపురం బస్టాప్ దగ్గర టాయిలెట్ కోసం కారు ఆపి… డ్రైవర్ పై  పెప్పర్ స్ర్పేతో దాడి చేసి…నీటి కాలువలో పడేసి హత్యచేశాడు. కారుతో పారిపోయాడు నిందితుడు రోషన్.  అక్కడ క్లూస్ దొరక్కపోవడంతో పోలీసులకు సవాలుగా మారింది.  కానీ టెక్నాలజీ, సీసీ కెమేరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్టు సీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు. విచారణలో బైక్ దొంగతనాలకు కూడా పాల్పడినట్లు గుర్తించారు.  దొంగలించిన బండ్లకి OLX లో అమ్మకాని పెట్టిన వెహికిల్స్ నంబర్లు పెట్టి అమ్ముతూ జల్సాలు చేశాడు. పోలీసులు హత్యకు ఉపయోగించిన పెప్పర్ స్ర్పే బాటిల్స్,  రెండు సెల్ ఫోన్లు,  దొంగతనాలు చేసిన నాలుగు బైక్ లను స్వాదీనం చేసుకున్నారు.