స్నేహితుడితో కలిసి అమ్మమ్మ గొలుసు చోరీ.. ఇద్దరు అరెస్ట్..

స్నేహితుడితో కలిసి అమ్మమ్మ గొలుసు చోరీ.. ఇద్దరు అరెస్ట్..

అంబర్ పేట,వెలుగు: అమ్మమ్మను కత్తితో గాయపరిచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన మనుమడిని పోలీసులు పట్టుకున్నారు. ఇన్​స్పెక్టర్ కిరణ్ కుమార్, డీఐ హఫీస్ వివరాల ప్రకారం.. కూకట్ పల్లికి చెందిన బ్రిజష్ పాల్ ఈ నెల 7న శంకర్ నగర్​లో ఉండే తన తల్లి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అమ్మమ్మ రాజకుమారి ఇంట్లో ఒంటరిగా ఉండడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. మెడలో ఉన్న 28 గ్రాముల గోల్డ్​ చైన్​ను లాక్కొని పారిపోయాడు.

గొలుసును తన స్నేహితుడైన బోరబండకు చెందిన పర్వీజ్ వద్ద ఉంచాడు. గురువారం ఆ చైన్​ను అమ్మేందుకు ఇద్దరు కలిసి తిలక్ నగర్ లోని ఓ షాపు వద్దకు వెళ్లగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని  క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారు చైన్, కారు, సెల్ ఫోను స్వాధీనం చేసుకొని ఇద్దరిని రిమాండ్​కు పంపారు.