విదేశాల నుంచి వచ్చిన కొంతమంది వీసా.. పాస్పోర్టు గడువు ముగిసినా హైదరాబాద్ నగరాన్ని వదలడం లేదు. నిబంధలనకు విరుద్దంగా నగరంలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో నైజీరియన్లు నివసించే ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేశారు. కొంతమంది నైజీరియన్లు వీసా, సాప్పోర్టు గడువు ముగిసినా.. నగరంలో నివసిస్తున్నారు. దీంతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ P&T కాలనీ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. వీసా ముగిసినప్పటికి ఓ మహిళ నగరంలోనే నివసిస్తుంది. ఆ నైజీరియన్ మహిళను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
