సోషల్​ మీడియా పోస్టింగులపై పోలీసుల నజర్​

సోషల్​ మీడియా పోస్టింగులపై పోలీసుల నజర్​
  • హిజాబ్​, కర్మన్​ఘాట్​ ఘటనలు, ఉక్రెయిన్​పై దాడి దృష్ట్యా అలర్ట్‌ 
  • ఐటీ సెల్​, ఇంటెలిజెన్స్​ టీమ్స్​తో మానిటరింగ్​
  • బస్తీల్లో బ్లూ కోల్ట్స్​ టీమ్స్​ పహారా

హైదరాబాద్​, వెలుగు: కర్నాటకలో హిజాబ్​ ఇష్యూ, కర్మన్​ఘాట్​ దాడి ఘటన, ఉక్రెయిన్​పై రష్యా దాడి నేపథ్యంలో హైదరాబాద్​ సిటీ పోలీసులు అలర్ట్​ అయ్యారు. సోషల్​ మీడియా పోస్టింగులపై నిఘా పెట్టారు. రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు, కామెంట్లను పెట్టే వాళ్లను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ఐటీ సెల్​, ఇంటెలిజెన్స్​ టీమ్స్​తో సోషల్​ మీడియాను ఎప్పటికప్పుడు మానిటర్​ చేస్తున్నారు. కమ్యూనల్​, హిస్టరీ షీట్స్​ ఉన్న అనుమానితులపై నిఘా ఉంచారు. వాళ్ల వాట్సాప్​ గ్రూపులపై ఫోకస్​ పెట్టారు. సోషల్​ మీడియా, వాట్సాప్​ గ్రూపుల్లో పోస్టింగులు, కామెంట్ల డేటాను తీస్తున్నారు. గోవుల అక్రమ రవాణను అడ్డుకున్న గోరక్షక్​ సభ్యులపై మంగళవారం కర్మన్​ఘాట్​లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటన సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బజరంగ్​దళ్​, గోరక్షక్​, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం సంతోష్​నగర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కర్మన్​ఘాట్​ హనుమాన్​ టెంపుల్​ వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.  

బస్తీల్లో పహారా
ఓల్డ్​సిటీతో పాటు గ్రేటర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో రాత్రి పూట పెట్రోలింగ్​  పెంచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. కమ్యూనల్​ కేసుల్లో నిందితులుగా ఉన్నోళ్ల డేటాను కలెక్ట్​ చేశారు. గత నెల రోజుల్లో వాళ్ల యాక్టివిటీలను తెలుసుకుంటున్నారు. బస్తీల్లో బ్లూ కోల్ట్స్​ సిబ్బందితో పహారా చేస్తున్నారు. డీసీపీలు, ఏసీపీలు, ఇన్​స్పెక్టర్లతో ఎప్పటికప్పుడు మీటింగులు నిర్వహిస్తున్నారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లు బెదిరింపులకు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.