పోలీస్ ఆఫీసర్ కు కరోనా పాజిటివ్

పోలీస్ ఆఫీసర్ కు కరోనా పాజిటివ్

థానే : మహారాష్ట్రలో ఓ పోలీసు ఆఫీసర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. థానే పోలీస్ కమిషనరేట్ లో ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న ఆ అధికారి ఇటీవల సొంతూరు నాసిక్ వెళ్లాడు. కొన్ని రోజులుగా తీవ్రంగా జర్వం రావటంతో ఆయన కరోనా టెస్ట్ చేశారు. ఆయన కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో నాసిక్ లోనే ట్రీట్ మెంట్ఇస్తున్నారు. కరోనా పేషెంట్ తో కాంటాక్ట్ కారణంగానే పోలీస్ ఆఫీసర్ కు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఆయనతో కాంటాక్ట్ అయిన వారిని ట్రేస్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.