బీజేపీ, టీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు

బీజేపీ, టీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు

నల్గొండ జిల్లాలో బండి సంజయ్ టూర్ కు అనుమతి లేదన్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి తీసుకోకుండా పర్యటించడం సరికాదన్నారు. పర్యటనలో బీజేపీ,టీఆర్ఎస్ కార్యకర్తల పరస్పర  దాడిలో  పోలీసులు గాయపడ్డారన్నారు. అనుమతి లేకుండా పర్యటించారని బండి సంజయ్, బీజేపీ నేతలపై కేసులు నమోదు చేశామన్నారు నల్గొండ ఎస్పీ రంగనాథ్.  చివరి నిమిషంలో బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి కోసం లేఖ ఇచ్చారన్నారు. అనుమతి లేని కారణంగా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భద్రతా చర్యలు చేపట్టామన్నార.  బండి సంజయ్ కాన్వాయిపై  రాళ్లు, కోడిగుడ్లు వేస్తున్నారనే సమాచారంతో అప్పటికప్పుడు ఉన్న సిబ్బందితోనే పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామన్నారు. బండి సంజయ్ పైన ..బీజేపీ , టీఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో వీడియో ఆధారాలతో కేసులు నమోదు చేశామన్నారు.