
సికింద్రాబాద్ బేగంపేట్లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో రూ. 4 కోట్ల డబ్బును అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి ఒక కారులో నుంచి మరో కారులోకి నగదును మారుస్తుండగా..అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా పొంతన లేని సమాధానాలిచ్చారు. దీంతో నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు..ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రెండు కార్లను సీజ్ చేశారు.
ముగ్గురు యువకులు వెంకటేశ్వర్లు, ప్రశాంత్, రిషబ్ చౌదరీలుగా పోలీసులు తెలిపారు. వారిని విచారించగా...రుతు ప్రియ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ కు చెందిన డబ్బుగా పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు, రసీదును చూపకపోవడంతో రూ. 4 కోట్లను పోలీసులు ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.