పంజాగుట్ట పరిధిలో పోలీసుల తనిఖీలు.. హవాలా డబ్బు స్వాధీనం

పంజాగుట్ట పరిధిలో పోలీసుల తనిఖీలు.. హవాలా డబ్బు స్వాధీనం

అర్ధరాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సెర్చింగ్ ఆపరేషన్ లో 70  లక్షల హవాలా మనీ సీజ్ చేసినట్టు సమాచారం. వాహన తనిఖీలు చేస్తుండగా ఈ హవాలా మనీ పట్టుబడ్డట్టు తెలుస్తోంది. పంజాగుట్ట నుండి సోమాజిగూడ మీదుగా వెళ్తున్న  మార్గంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. హవాలా మనీని సీజ్ చేశారు. తనిఖీల సమయంలో సరైన ధ్రువపత్రాలు లెకపోవడంతో 70 లక్షల నగదునుతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లో ఇటీవల హవాలా డబ్బు భారీగా పట్టుబడుతోంది. గత కొన్ని రోజుల క్రితం రెండు రోజుల వ్యవధిలోనే రూ. 4 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కరోజే వెస్ట్ జోన్ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు రెండున్నర కోట్ల హవాలా నగదును సీజ్ చేశారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని.. జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. అంతకు ముందు రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ వెంకటగిరికాలనీలో రూ.54 లక్షల హవాలా నగదును సీజ్ చేశారు.