స్టేషన్ లో ఉమ్మిన పోలీసులపై ఉన్నతాధికారి సీరియస్

స్టేషన్ లో ఉమ్మిన పోలీసులపై ఉన్నతాధికారి సీరియస్

షాడోల్: సమాజంలో అందరినీ క్రమశిక్షణతో మెలిగేలా చేయాల్సిన పోలీసులే డిసిప్లిన్డ్ గా లేకపోతే? ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాల్సిన పోలీసులే తప్పు చేస్తే? అందుకే పోలీసులను దండించడానికి పోలీసు బాస్ బరిలోకి దిగారు. స్టేషన్ పరిసరాల్లో ఉమ్మి వేయొద్దని పలు మార్లు హెచ్చరించినా వినలేదని.. ఎస్ఐ, అడిషనల్ ఎస్ఐ, ఏఎస్ఐతో సహా హెడ్ కానిస్టేబుల్ పై ఉన్నతాధికారి చర్యలకు ఆదేశించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గోపారులో చోటు చేసుకుంది. 

పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. పాన్, టొబాకో, గుట్కాలను ఉమ్మి వేయొద్దని ఉన్నతాధికారులు స్టేషన్ సిబ్బందికి పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినా వారు పట్టించుకోకుండా స్టేషన్ లో ఉమ్మి వేసేవారు. దీంతో ఎస్ఐ నంద్ కుమార్ కచ్ వాలా, అడిషనల్ ఎస్ఐ దినేశ్ ద్వివేదీ, ఏఎస్ఐ దేవేంద్ర సింగ్, హెడ్ కానిస్టేబుల్ ప్యారే లాల్ పై  ఏఎస్పీ ముకేశ్ వైశ్యా చర్యలకు ఆదేశించారు. ఈ నలుగురిని స్టేషన్ విధుల నుంచి తప్పించి.. పోలీస్ లైన్స్ కు అటాచ్ చేశారు.