బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ లో ఆధిపత్య పోరేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు మద్దతుగా నెటిజన్లు #boycotbollywood యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిచోర్ విజయం తరువాత, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఏడు చిత్రాలకు సంతకం చేశారు. అయితే ఆరు నెలల వ్యవధిలో అవన్నీ కోల్పోయారు. ఎందుకు..? చిత్ర పరిశ్రమలో క్రూరత్వం తారాస్థాయికి చేరింది. . ఈ క్రూరత్వం అతని ప్రాణాలను తీసింది. మనం టాలెంటెడ్ నటుడిని కోల్పోయామని ట్వీట్ చేశారు.
छिछोरे हिट होने के बाद #सुशांत_सिंह_राजपूत ने सात फिल्में साइन की थी।
छह महीने में उसके हाथ से सारी फिल्में निकल गई थीं।क्यों ?
फ़िल्म इंडस्ट्री की निष्ठुरता एक अलग लेवल पर काम करती है।
इसी निष्ठुरता ने एक प्रतिभावान कलाकार को मार डाला।
सुशांत को विनम्र श्रद्धांजलि!#RIPSushant— Sanjay Nirupam (@sanjaynirupam) June 14, 2020
