త్రిపురలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. 60 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 81.10 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2018లో అధికారంలోకి వచ్చిన బీజేపీ మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ప్రతిపక్ష సీపీఎం ఈసారి కాంగ్రెస్‌తో జట్టుకట్టి బీజేపీని గద్దె దించుతామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మార్చి 2న ఫలితాలు వెలువడనున్నాయి.
