చార్మినార్: శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి : పాలిటెక్నిక్ విద్యార్థులు

చార్మినార్: శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి : పాలిటెక్నిక్ విద్యార్థులు
  • బహదూర్​పుర చౌరస్తా వరకు భారీ ర్యాలీ

చార్మినార్, వెలుగు: పాతబస్తీలోని కులీ కుతుబ్​షా పాలిటెక్నిక్​కాలేజీ విద్యార్థులు సోమవారం చందూలాల్ బారాదరి నుంచి బహదూర్​పుర చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. శక్తి పాలసీని, పాలిటెక్నిక్ కాలేజీలను ఐటీఐలలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడేండ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల గుర్తింపును దెబ్బతీసే చర్యలను మానుకోవాలన్నారు. 

పాలిటెక్నిక్ విద్యను, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.