V6 News

బీఆర్ఎస్ అక్రమాల చిట్టా సిద్ధమవుతోంది : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

బీఆర్ఎస్ అక్రమాల చిట్టా సిద్ధమవుతోంది : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  •     కేబినెట్ ​విస్తరణ విడతల వారీగా ఉంటది: పొంగులేటి

హైదరాబాద్​, వెలుగు: బీఆర్ఎస్​అక్రమాల చిట్టా సిద్ధమవుతోందని, సరైన సమయంలో ఆధారాలతో సహా బయటపెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ విడతల వారీగా ఉంటుందని పేర్కొన్నారు. ఏ శాఖ ఎవరికీ శాశ్వతం కాదని, ఆశావహులు తమకు నచ్చిన శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజమేనని చెప్పారు. శనివారం సెక్రటేరియెట్​లో మీడియాతో ఆయన చిట్​చాట్​చేశారు. 

త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని, సమ్మర్ తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ధరణి సమస్యలకు భూ-భారతితో శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అసైన్డ్ భూములపై వస్తున్న ఫిర్యాదులను త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పారు.