తమిళనాడులో మనమే గెలుస్తం.. ప్రధాని మోదీతో పొంగులేటి సుధాకర్ రెడ్డి

తమిళనాడులో మనమే గెలుస్తం.. ప్రధాని మోదీతో పొంగులేటి సుధాకర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని బీజేపీ తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సహ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం తమిళనాడు బీజేపీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి అరవింద్ మీనన్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయన ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంపై మోదీకి అభినందనలు తెలిపారు.

తమిళనాడులోనూ బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.  చెంగల్‌‌‌‌‌‌‌‌పట్టు జిల్లా మధురాంతకంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ.. తమిళనాడులో ఎన్డీయే కూటమి బలాన్ని చాటి చెప్పిందని, క్షేత్రస్థాయిలో కూటమి బలంగా ఉందని పేర్కొన్నారు.