
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ను బీజేపీ తమిళనాడు – కర్నాటక జాతీయ సహ -ఇన్‌చార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి అధికారిక నివాసం వీపీ ఎన్‌క్లేవ్‌లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీపీ రాధాకృష్ణన్ తో తమిళనాడులోని కోయంబత్తూర్ జ్ఞాపకాలను పంచుకున్నట్లు సుధాకర్ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.
సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయవంతమైన పదవీకాలం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే, దక్షిణాది నుంచి ఓ సాధారణ నాయకుడిని దేశ రెండవ అత్యున్నత పదవికి ఎన్నుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. రాధాకృష్ణన్ వంటి మంచి వ్యక్తికి ఉపరాష్ట్రపతిగా అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నట్లు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.