
గాంధీభవన్ ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో డెలిగేట్ కార్డులు ఇచ్చిన వ్యక్తులకు ఓటేసే అవకాశం కల్పించలేదని ఆరోపించారు. తనతో పాటు జనగామకు చెందిన వ్యక్తికి డెలిగేట్ కార్డు ఇచ్చారని.. అతడు ఓటేయడానికి వస్తే అవకాశమివ్వలేదని పొన్నాల ఆరోపించారు. కార్డు ఇచ్చి ఎందుకు ఓటేసే అవకాశం కల్పించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
రెండు రోజుల క్రితం నారాయణ ఖేడ్ కు చెందిన ఓ వ్యక్తికి పీసీసీ డెలిగేట్ కార్డు ఇచ్చారని.. ఇప్పుడా వ్యక్తి ఓటేసేందుకు వస్తే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని దామోదర్ రాజనర్సింహ మండిపడ్డారు. తన 55 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదని చెప్పారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల్ని అవమానించడమేనని.. దీనికి సమాధానం చెప్పాలన్నారు.