హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి గత నెల10 నుంచి మొదలైన కౌంటింగ్‌లో బుధవారం మొదటి ఫలితం వెలువడింది. 23 మంది బార్ కౌన్సిల్ సభ్యులకుగాను మొదటి సభ్యుడిగా పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ విజయం సాధించారు. బార్ కౌన్సిల్‌కు ఐదుగురు మహిళా సభ్యులతో పాటు 23 మంది సభ్యుల ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించగా.. 55 మంది మహిళలతో పాటు 203 మంది పోటీ చేశారు.
గత నెల 10 నుంచి ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొదటి ప్రాధాన్యతా ఓట్లతో ఎవరూ ఎంపిక కాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. దీంతో 870 మొదటి ప్రాధాన్యం, 215 రెండో ప్రాధాన్యం ఓట్లతో 1,085 ఓట్లు సాధించి పొన్నం అశోక్‌గౌడ్ మొదటి సభ్యుడిగా ఎంపికయ్యారు.
