లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం మహిళలకే అవమానం: కాంగ్రెస్

లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం మహిళలకే అవమానం: కాంగ్రెస్

ఢిల్లీ లిక్కర్ స్కాంల్ కవితకు ఈడీ నోటీసులివ్వడంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు.  లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉండటం మహిళలకే అవమానమని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కవిత మంటగలిపారని విమర్శించారు. డబ్బులకు ఆశపడి మహిళలు చేయరాని లిక్కర్ వ్యాపారంలో కవిత భాగమయ్యారని ఆరోపించారు.

బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు  కాంగ్రెస్ పార్టీకి పడకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ అన్నారు. కవితను విచారణ పేరుతో ఈడీ ఢిల్లికి పిలవడం అంతా వ్యూహమేనని అన్నారు.